కొల్లం అజిత్
ప్రముఖ మలయాళం నటుడు కొల్లం అజిత్ కన్నుమూశారు. ఆయన 500లకుపైగా సినిమాల్లో నటించారు. కడుపు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న కొల్లం అజిత్ గత కొన్నిరోజులుగా కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు తుదిశ్వాస విడిచారు.
1983లో పరన్ను పరన్ను పరన్ను సినిమాతో ఆరంగేట్రం చేసిన కొల్లం అజిత్.. చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించారు. కొన్ని సినిమాల్లో సహాయక పాత్రల్లో కనిపించారు. 1989లో విడుదలైన అగ్నిప్రవేశం సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. యువజనోత్సవం, నడోడికట్టు, నంబర్ 20 మద్రాస్ మెయిల్, నిర్ణయం, ఆరం థంపురన్, ఒలింపియన్ ఆంతోనీ యాడం, వల్లీత్తన్ తదితర సినిమాల్లో మంచి నటన కనబరిచి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ ఆయన నటించారు. కాలింగ్ బెల్, పకల్ పోలె వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా ఆయన 2012లో ఇవాన్ అర్ధనారి సినిమాలో కనిపించారు. ఆయనకు భార్య ప్రమీల, కూతురు గాయత్రి, కొడుకు శ్రీహరి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment