సీనియర్‌ నటి నిమ్మి కన్నుమూత | Actress Nimmi Deceased In Mumbai | Sakshi
Sakshi News home page

సీనియర్‌ నటి నిమ్మి కన్నుమూత

Published Thu, Mar 26 2020 10:28 AM | Last Updated on Thu, Mar 26 2020 10:28 AM

Actress Nimmi Deceased In Mumbai - Sakshi

ముంబై : ప్రముఖ సీనియ‌ర్ బాలీవుడ్ న‌టి న‌వాబ్ బానూ(నిమ్మి) క‌న్నుమూశారు. బుధ‌వారం గుండెపోటు రావ‌డంతో ముంబైలోని ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు నిమ్మి మృతిపై సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. సీనియర్‌ నటులు మ‌హేష్ భ‌ట్‌, రిషి క‌పూర్ నిమ్మి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1950, 1960 దశకాల‌లో పలు చిత్రాల్లో న‌టించిన ఆమె.. మంచి న‌టిగా గుర్తింపు సాధించారు. 1949లో రాజ్ క‌పూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బ‌ర్సాత్ సినిమాతో నిమ్మీ సినిమా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టారు. కాగా, నిమ్మి అంత్యక్రియలు గురువారం రే రోడ్డులోని స్మశాన వాటికలో జరగనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement