త్రిష అయితేనేం | Actress Trisha checked up by Chennai Airport Police | Sakshi

త్రిష అయితేనేం

Jul 13 2014 12:09 AM | Updated on Apr 3 2019 9:17 PM

త్రిష అయితేనేం - Sakshi

త్రిష అయితేనేం

ఎంత సెలబ్రెటీస్ అయినా ఒక్కోసారి అనూహ్య సంఘటనలను ఎదుర్కొనవలసి వస్తుంది. అలాంటి వాటిని సీరియస్‌గా తీసుకుంటేనే అశాంతికి గురి కావలసి వస్తుంది.

 ఎంత సెలబ్రెటీస్ అయినా ఒక్కోసారి అనూహ్య సంఘటనలను ఎదుర్కొనవలసి వస్తుంది. అలాంటి వాటిని సీరియస్‌గా తీసుకుంటేనే అశాంతికి గురి కావలసి వస్తుంది. నటి త్రిషకు శనివారం చెన్నై ఎయిర్‌పోర్టులో ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఈ చెన్నై చిన్నది దశాబ్దం పైగా హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. బాలీవుడ్ ప్రవేశం కూడా చేశారు. అలాంటి పాపులర్ హీరోయిన్ త్రిషను చెన్నై విమానాశ్రయ రక్షణాధికారులు గుర్తించకపోవడం విశేషం. ఇంతకీ ఏం జరిగిందంటే..
 
 త్రిష హైదరాబాద్ వెళ్లడం కోసం శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయం చేరుకున్నారు. ప్యాంట్, షర్టు, కూలింగ్ గ్లాస్ ధరించిన త్రిషపై అక్కడి సెక్యూరిటీ అధికారులకు సందేహం కలిగింది. వెంటనే ఆమె వద్దకు వెళ్లి గుర్తింపుకార్డు చూపించమని అడిగారు. చిరు వాగ్వాదం తరువాత త్రిష తన గుర్తింపుకార్డు చూపించారు. దీంతో ఆమెను సెక్యూరిటీ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతించారు. దీన్ని లైట్‌గా తీసుకున్న త్రిష మాట్లాడుతూ విమానాశ్రయం సెక్యూరిటీ అధికారులు తన గుర్తింపు కార్డును చూపించమని అడగటంలో తప్పు లేదన్నారు. కొన్ని అసాంఘిక సంఘటనలు జరుగుతున్న కారణంగా వారు భద్రత ఏర్పాట్లపై శ్రద్ద వహిస్తున్నారని త్రిష పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement