మరో వివాదంలో అమల | Amala Paul Yoga Photo Shoot Controversy | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో అమల

Published Sat, Apr 1 2017 12:55 PM | Last Updated on Wed, May 29 2019 2:59 PM

మరో వివాదంలో అమల - Sakshi

మరో వివాదంలో అమల

అమలాపాల్.. సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఈ భామ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచే కాంట్రవర్సీలు మొదలు పెట్టింది ఈ బ్యూటి. తొలి నాళ్లలో భర్త తండ్రితో ఎఫైర్ పెట్టుకునే మహిళ పాత్రలో నటించి మహిళ సంఘాల ఆగ్రహానికి గురైంది. ఆ తరువాత కూడా మరికొన్ని వివాదాల్లో అమల పేరు వినిపించగా.. ఇటీవల భర్త విజయ్తో విడాకుల విషయం కూడా ప్రముఖంగా వార్తల్లో వినిపించింది.

తాజాగా మరో వివాదం ఈ అమ్మడి మెడకు చుట్టుకుంది. అమల, యోగా చేస్తూ తీయించుకున్న ఫోటోషూట్ తాజా వివాదానికి కారణం. బుద్ధుడి ముందు యోగా చేస్తున్నట్టుగా ఫోటో షూట్ చేయించుకుంది అమలా పాల్. అయితే ఈ ఫోటోలో శీర్షాసనం వేసిన ఫోటోలో అమలా కాళ్లు బుద్దుడి ముఖం మీద ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. దీంతో బౌద్దాన్ని అనుసరించే వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. వారు ఆ ఫోటోలను తొలగించాలని, క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. కానీ అమలా పాల్ మాత్రం ఈ వివాదంపై ఇంతవరకు స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement