సందడే సందడి! | Camera's Favourite Lady At IIFA Shruti Haasan | Sakshi
Sakshi News home page

సందడే సందడి!

Published Wed, Jan 27 2016 10:47 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

సందడే సందడి!

సందడే సందడి!

 ఆది, సోమవారం... ఈ రెండు రోజులూ అంగరంగ వైభవంగా జరిగిన ‘ఐఫా- ఉత్సవం’ 2016 అవార్డు వేడుక హైదరాబాద్‌లో హాట్ టాపిక్ అయ్యింది. జియోనీ, రేనాల్ట్ సంస్థల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అందించిన ఈ ఉత్సవంలో పలువురు తారలు పాల్గొని, వీక్షకులను అలరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రంగాలకు చెందిన తారలు ఒకే వేదికపై కనిపించడంతో పాటు స్నేహంగా మాట్లాడుకుని, కళకు భాషాభేదం లేదని మరోసారి నిరూపించారు.
 
 తెలుగు, కన్నడ పరిశ్రమల అవార్డు ప్రదానం సందర్భంగా మామూలుగానే సరదాగా ఉండే విక్టరీ వెంకటేశ్ హుషారుగా దేవిశ్రీప్రసాద్‌తో వేసిన స్టెప్స్ ప్రత్యేక సందడిని తీసుకొచ్చాయి. ప్రముఖ కన్నడ హీరో శివరాజ్‌కుమార్ చేసిన హై ఓల్టేజ్ డ్యాన్స్ భేష్ అనిపించింది. శరీరాకృతికి తగ్గట్లుగా పర్పుల్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో అందమైన శిల్పాన్ని తలపించారు శ్రుతీహాసన్. ఇంకా బోల్డన్ని ప్రత్యేకతలతో సాగిన రెండోరోజు వేడుకకు హీరోలు అల్లు శిరీష్, నవదీప్, హీరోయిన్ రెజీనా చేసిన యాంకరింగ్ ఓ హైలైట్.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement