రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం1985’ | Hero ram charan movie title: Rangastalam 1985 | Sakshi
Sakshi News home page

చెర్రీ లేటెస్ట్‌ మూవీ టైటిల్‌ ఫిక్స్‌

Published Fri, Jun 9 2017 10:17 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

Hero ram charan movie title: Rangastalam 1985

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ తాజా చిత్రానికి టైటిల్‌ ఫిక్స్‌ అయింది. చెర్రీ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ఎట్టకేలకు ‘రంగస్థలం 1985’అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్‌ శుక్రవారం ఉదయం ట్విట్టర్‌ ద్వారా సినిమా పేరును అధికారికంగా వెల్లడించింది.

కాగా ఈ సినిమాకు టైటిల్‌ కన్ఫర్మ్‌ చేసేందుకు రామ్ చరణ్‌ గతంలో అభిమానులను హెల్ప్‌ కూడా అడిగాడు.  త్వరగా టైటిల్‌ కన్ఫర్మ్‌ కావాలంటే ‘‘ప్లీజ్‌ సార్‌... మాకు ఓ టైటిల్‌ ఇవ్వండి’’ అని సుకుమార్‌పై ఏదో రూపంలో ఒత్తిడి పెంచమని అభిమానులను చరణ్‌ కోరిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌ కాగా జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. పాపికొండలు, రాజమండ్రి, కొల్లేరు పరిసర పల్లెటూళ్లలో సుమారు నెలరోజుల పాటు షూటింగ్‌ జరిపారు. ఈ చిత్రానికి కెమేరా: రత్నవేలు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్‌ చెరుకూరి (సీవీఏం).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement