చరణ్కు కూడా అతనే విలన్..? | Jagapathi Babu in Ram Charan, Sukumar Film | Sakshi
Sakshi News home page

చరణ్కు కూడా అతనే విలన్..?

Published Tue, Jan 31 2017 10:10 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

చరణ్కు కూడా అతనే విలన్..?

చరణ్కు కూడా అతనే విలన్..?

సౌత్లో స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు అందరి సినిమాల్లో ప్రతినాయకుడిగా అలరిస్తున్న సీనియర్ స్టార్ జగపతి బాబు. లెజెండ్ సినిమాతో విలన్గా మారిన జగపతిబాబు, ప్రస్తుతం హీరోగా చేసినప్పటికంటే ఎక్కువ బిజీగా ఉన్నాడు ఈ మ్యాన్లీ స్టార్. తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా స్టార్ హీరోల సినిమాల్లో నెగెటివ్ పాత్రల్లో నటిస్తున్నాడు జగ్గుభాయ్.

సోమవారం ప్రారంభమైన రామ్ చరణ్, సుకుమార్ల సినిమా కోసం కూడా జగపతిబాబునే విలన్గా ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలో స్టైలిష్ విలన్గా ఆకట్టుకున్నాడు జగపతిబాబు. అందుకే తన నెక్ట్స్ సినిమా కోసం కూడా ఈ సీనియర్ స్టార్ అయితేనే విలన్గా కరెక్ట్ అని భావిస్తున్నాడట సుకుమార్.

సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా 1980ల నాటి ప్రేమకథగా తెరకెక్కుతోంది. రామ్ చరణ్ తొలిసారిగా పల్లెటూరి యువకుడిగా కనిపిస్తుండటం, ఇప్పటికే విడుదలనై ఫస్ట్ లుక్లో హీరో గెటప్కు సంబంధించిన హింట్ ఇచ్చేయడంతో సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement