పల్లెటూరి మొనగాడు...పట్నంలోకి వచ్చాడు! | Ram Charan New Film Shooting At Hyderabad For The Next Schedule | Sakshi
Sakshi News home page

పల్లెటూరి మొనగాడు...పట్నంలోకి వచ్చాడు!

Published Tue, May 9 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

పల్లెటూరి మొనగాడు...పట్నంలోకి వచ్చాడు!

పల్లెటూరి మొనగాడు...పట్నంలోకి వచ్చాడు!

గళ్ల లుంగీ... గుబురు గడ్డం... చేతిలో కర్ర... మెడలో తువ్వాలు... రామ్‌చరణ్‌ గెటప్‌ అయితే పూర్తిగా మారింది. మరి, యాస–భాష ఎలా ఉంటాయో త్వరలో తెలుస్తాయి. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న సినిమాలో రామ్‌చరణ్‌ పక్కా పల్లెటూరి యువకుడిగా నటిస్తున్నారనేది కన్ఫర్మ్‌. చరణ్‌ గెటప్, లీకైన స్టిల్స్, గట్రా చూస్తే ఆ విషయం అర్థమవుతోంది.

ఈ సినిమా కోసం పాపికొండలు, రాజమండ్రి, కొల్లేరు పరిసర పల్లెటూళ్లలో సుమారు నెలరోజుల పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. గత నెలలో ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. మంగళవారం సెకండ్‌ షెడ్యూల్‌ మొదలైంది. పల్లెటూరి మొనగాడు పట్నంలోకి వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తున్నారు. సినిమా కోసం సిటీలో స్పెషల్‌ సెట్‌ వేశారని సమాచారం.

ఈ షెడ్యూల్‌లో హీరోతో పాటు కథానాయిక సమంత, కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు తదితర ముఖ్య తారాగణం పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్‌ కూడా సుమారు నెల రోజులు జరుగుతుందని టాక్‌. ఈ చిత్రానికి కెమేరా: రత్నవేలు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్‌ చెరుకూరి (సీవీఏం).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement