ఎవరూ కలవలేదు
ఎవరూ కలవలేదు
Published Mon, Jan 6 2014 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
నన్నెవరు కలుసుకోలేదు. అలా వచ్చిన వారినెవరినీ నేను కాదనలేదు అంటున్నారు నటి హన్సిక. ఇంతకీ ఏమిటామె గోడు అంటారా? ఇంకేముంటుంది ప్రేమ గోలే. నిత్యం వార్తల్లో ఉండే తారల్లో నటుడు శింబు, నటి హన్సిక ఒకరు. వీరిద్దరూ ప్రేమలో పడటం ఒక విశేషం. అయితే కొద్ది రోజులకే ఆ ప్రేమ బ్రేక్ అప్ అవడం అనేది కలకలం. ఇందుకు కారణం శింబు మాజీ ప్రేయసి నయనతారేనన్నది ప్రచారం. ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ శింబు, హన్సిక ప్రకటించారు.
వెంటనే పెళ్లి చేసుకుందామన్న శింబు కోరికకు మరో ఐదేళ్ల తర్వాతే పెళ్లంటూ హన్సిక బ్రేక్ వేశారు. ఈ బ్యూటీ వ్యాఖ్యల వెనుక ఆమె కుటుంబం హస్తం ఉందని సమాచారం. హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న హన్సిక కోట్ల ఆర్జనను వదలుకోవడానికి వారు సిద్ధంగా లేరనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో శింబు, హన్సిక మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని తెలిసింది. సరిగ్గా ఇలాంటి తరుణంలో పుండు మీద కారం చల్లినట్లు నటి నయనతార మళ్లీ శింబుతో జత కట్టడం. వీరిద్దరు మాజీ ప్రేమికులనే విషయం తెలిసిందే. చాలా గాఢంగా ప్రేమించుకున్న శింబు, నయనతారల లిప్‌లాక్ ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడం, అందుకు శింబునే కారణమని తెలిసి నయన అగ్గిమీద గుగ్గిలయ్యారు.
ఫలితంగా ఇద్దరు విడిపోయారు. ఆ తరువాత నయనతార ప్రభుదేవాల ప్రేమ, విడిపోవటాలు తెలిసిన విషయమే. దీంతో జీవితంలో ప్రేమ జోలికి పోకూడదని నిర్ణయించుకున్న నయనతార మళ్లీ నటనపై దృష్టి సారించారు. తాజాగా పాండిరాజా దర్శకత్వంలో శింబుకు జంటగా నటించడం కలకలం రేపగా హన్సిక జీవితంలో మాత్రం కల్లోలం సృష్టించింది. శింబు నయనతారతో నటించడం ఇష్టంలేని హన్సిక ఆయనకు మరింత దూరం అయినట్లు సమాచారం. అయితే ఆమె ఎడబాటును భరించలేని శింబు, ఏ షూటింగ్‌లో హన్సిక ఉన్నా అక్కడికి వెళ్లి కలిసే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం. ఇటీవల హన్సిక అమెరికా, శింబు లండన్ వెళ్లారు.
అయితే శింబు హన్సికను కలవడానికి లండన్ నుంచి అమెరికా వెళ్లినట్లు అప్పుడామె ఆయన్ని కలుసుకోవడానికి ఇష్టపడలేదనే వార్త ఇంటర్నెట్‌లో హాట్ హాట్‌గా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఒక తమిళ పత్రిక కిచ్చిన భేటీలో హన్సిక స్పందిస్తూ తాను తన స్నేహితులతో అమెరికాకు హాలీడే టూర్ వచ్చినట్లు పేర్కొన్నారు. తన ఫ్రెండ్స్‌తో జాలీగా ఎంజాయ్ చేస్తున్నానని, తనను కలవడానికి ఎవరు రాలేదని, అదే విధంగా తానెవరిన్ని కలుసుకోవడానికి నిరాకరించలేదని స్పష్టం చేశారు. ఈ నెల 19వరకు తాను అమెరికాలోనే గడుపుతానని 20న చెన్నైకి తిరిగి చేరుకుంటానని ఈ మిల్క్ బ్యూటీ వివరించారు.
Advertisement
Advertisement