'నేనెవరితోనూ డేటింగ్ చేయడం లేదు'
ముంబై: వరుణ్ ధావన్..నటించింది రెండు సినిమాల్లోనే అయినా మహిళా అభిమానులను బానే సంపాదించుకున్నాడు. కాకపోతే అతనికి ఏ అమ్మాయితోనూ ఎఫైర్ లేదట. ఈ విషయాన్ని అతనే స్వయంగా ప్రకటించాడు. అసలు డేటింగ్ చేయడానికి సమయే లేదంటున్నాడు ఈ యువహీరో. 'ప్రస్తుతం నేను ఒంటరిగా ఉన్నాను. ఇలా గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా ఒంటరిగా ఉండటం చాలా బాగుంది' అంటూ పేర్కొన్నాడు. కాకపోతే తాను నతషా అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్న రూమర్లను ఖండించాడు. 'నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలా ఉన్నంత మాత్రాన వారితో సంబంధాలను ముడిపెట్టడం తగదు' అని తెలిపాడు.
దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడైన వరుణ్.. 2012 వ సంవత్సరంలో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' చిత్రంతో సినీ ఆరంగేట్రం చేశాడు. అనంతరం అతను తండ్రి డేవిడ్ ధావన్ తెరకెక్కించిన 'మైన్ తేరా హీరో' చిత్రంలో కూడా నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. మీపై వస్తున్న రూమర్లపై తండ్రి డేవిడ్ ఎలా స్పందిస్తున్నాడని ప్రశించగా.. అలాంటి ఊహాగానాలను మా నాన్న అసలు పట్టించుకోరు. 'మా నాన్న స్ట్రిక్ట్ కాదు..స్వీట్' అంటూ వరుణ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం అలియా భట్ కు జోడీగా నటిస్తున్న వరుణ్ పై బాలీవుడ్ లో గ్యాసిప్స్ జోరుగా హల్ చల్ చేస్తున్నాయి.