మళ్లీ బాలీవుడ్‌లో? | John Abraham, Ram Charan, Alia Bhatt to star in M.S. Dhoni :The Untold Story | Sakshi
Sakshi News home page

మళ్లీ బాలీవుడ్‌లో?

Published Fri, Dec 19 2014 10:42 PM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

మళ్లీ బాలీవుడ్‌లో? - Sakshi

మళ్లీ బాలీవుడ్‌లో?

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా ‘ఎం.ఎస్. ధోనీ’ పేరుతో హిందీలో ఓ చిత్రం తయారు కానుంది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చేయనున్నారు. ఇందులో ఉన్న ఓ కీలక పాత్రను రామ్‌చరణ్ చేయనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ‘జంజీర్’ చిత్రం ద్వారా హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడైన చరణ్ మంచి అవకాశం వస్తే, మళ్లీ హిందీలో నటిస్తానని ఓ సందర్భంలో చెప్పారు.

అందుకని ఈ చిత్రానికి పచ్చజెండా ఊపి ఉంటారనే ఊహాగానాలున్నాయి. ఇటీవల ఓ సందర్భంలో ఈ చిత్రం తారాగణం గురించి ఓ విలేకరి నీరజ్ పాండేని అడిగితే.. ‘‘ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాం. ఇప్పుడే నేను పేర్లు ప్రకటించలేను’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ధోనీ భార్య సాక్షీ సింగ్ పాత్రను అలియా భట్ చేయనున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement