దక్షిణాదిన అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన నయనతార.. ఇప్పటికీ మీడియా ముందు మాట్లాడటానికి ఇష్టపడదు. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలు చెప్పడమంటే ఆమెకు బొత్తిగా నచ్చదు. అందుకే.. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే.. ఇంటర్వ్యూలో పాల్గొనే ప్రస్తే లేదని తేల్చి చెప్తుంది. అలాంటి ఈ లేడీ సూపర్ స్టార్ ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తాను ఇంటర్వ్యూలకు అంగీకరించిపోవడానికి గల రహస్యాన్ని బయటపెట్టింది. తానేం ఆలోచిస్తుందో ప్రపంచానికి తెలియాలనుకోవట్లేదట. వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడం ఇష్టముండదని, పూర్తిగా ప్రైవేటు పర్సన్ అని చెప్పుకొచ్చింది. పైగా ఆమె మీడియాతో మాట్లాడిన విషయాలను చాలాసార్లు తప్పుగా ప్రచారంగా చేశారని వాపోయింది. (లాలీపాప్ కావాలా కన్నా..!)
అందుకే ఇలాంటివి తనవల్ల కాదని, కేవలం తాను నటించిన సినిమాల గురించే మాట్లాడతానని పేర్కొంది. మీడియాకు దూరంగా ఉంటే, లేనిపోని వివాదాలకు కూడా దూరంగా ఉండేందుకు దోహదపడుతుందని ఆమె తెలిపింది. కాగా నయన్ ప్రస్తుతం 'కాతు వాకుల రెండు కాదల్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఆమె ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరూ త్వరలోనే తమిళనాడులోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకోనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీని గురించి ఈ ప్రేమికులిద్దరూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. (నా పిల్లలకు కాబోయే తల్లి నయన్: విఘ్నేశ్)
Comments
Please login to add a commentAdd a comment