7 నిమిషాలకు 6 కోట్లు!
7 నిమిషాలకు 6 కోట్లు!
Published Tue, Dec 17 2013 1:03 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
క్రేజ్‌ని క్యాష్ చేసుకునే కళ అందరికీ ఉండదు. ప్రియాంక చోప్రాలాంటి ఏ కొద్దిమంది తారలకో మాత్రమే ఉంటుంది. బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరైన ఈ ముద్దుగుమ్మ సినిమాలకు, వాణిజ్య ప్రకటనలకు భారీ పారితోషికం డిమాండ్ చేస్తుంటారు. ఇప్పుడు కొత్త సంవత్సరం సందర్భంగా చెన్నయ్‌లో జరగనున్న ఓ వేడుకలో నర్తించడానికి ప్రియాంక డిమాండ్ చేసిన పారితోషికం విని, చాలామంది ‘ఔరా’ అనుకుంటున్నారు. ఆ వేడుకలో కేవలం ఏడే ఏడు నిమిషాలు ఈ బ్యూటీ కాలు కదపబోతున్నారని సమాచారం.
దీనికోసం ప్రియాంక తీసుకోబోతున్న పారితోషికం అక్షరాలా ఆరు కోట్ల రూపాయలు అని వినికిడి. ఏడు నిమిషాలకు ఇంత మొత్తం చాలా ఎక్కువని నిర్వాహకులకు అనిపించినప్పటికీ యువతలో ప్రియాంకకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇవ్వడానికి సిద్ధపడ్డారట. టికెట్స్ ద్వారా ఆ డబ్బుని వసూలు చేసుకోవచ్చనే ధీమాతో ఉన్నారట. అందుకే ఇప్పుడే ప్రచారం మొదలుపెట్టేశారట. ఈ నెల 31న జరగబోయే ఈ కార్యక్రమంలో జోరుగా హుషారుగా ఉండే పాటలకు నర్తించడానికి ప్రియాంక రెడీ అవుతున్నారని బాలీవుడ్ టాక్.
Advertisement
Advertisement