పవన్ vs బాలయ్య | Pawan vs Bala Krishna Clash At Box Office | Sakshi
Sakshi News home page

పవన్ vs బాలయ్య

Published Wed, Apr 19 2017 1:57 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ vs బాలయ్య - Sakshi

పవన్ vs బాలయ్య

కాటమరాయుడు సినిమాతో మరోసారి నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకే గ్యాప్ లేకుండా షూటింగ్ను ముగించి సెప్టెంబర్లో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.  మరోసారి పవన్ను స్టైలిష్ లుక్లో ప్రజెంట్ చేస్తున్న త్రివిక్రమ్ తన మార్క్ డైలాగ్స్తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు.

ఇటీవల తన వందో సినిమాతో భారీ హిట్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ క్రేజీ కాంబినేషన్లో సినిమా చేస్తున్నాడు. హీరోయిజాన్ని డిఫరెంట్ యాంగిల్లో చూపించే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. పూరి మార్క్ పంచ్ డైలాగ్లు పుష్కలంగా ఉన్న ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. జెట్ స్పీడుతో సినిమాలు ఫినిష్ చేసే పూరి ఈ సినిమా సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు.

పంచ్ డైలాగ్స్తోనే సినిమాను సగం సక్సెస్ చేసే త్రివిక్రమ్, పూరీలు తమ సినిమాలను ఒకే సమయంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల వరుసగా భారీ కాంపిటీషన్లో సినిమాలు రిలీజ్ చేస్తూ సక్సెస్ సాధిస్తున్న బాలయ్య, మరోసారి అదే ఫీట్ రిపీట్ చేసే ప్లాన్లో ఉన్నాడు. మరి ఈ పోటిలో పవన్ ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement