ప్రియాంక పెళ్లి అతడితో జరగాల్సింది..! | Priyanka Chopra Aunt Once Wanted Her To Marry Mohit Raina | Sakshi
Sakshi News home page

ప్రియాంక పెళ్లి అతడితో జరగాల్సింది..!

Published Thu, Jul 19 2018 6:00 PM | Last Updated on Thu, Jul 19 2018 6:03 PM

Priyanka Chopra Aunt Once Wanted Her To Marry Mohit Raina - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా పెళ్లి ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. వయసులో తన కంటే పదేళ్లు చిన్నవాడైన హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌తో ప్రేమలో ఉన్న ప్రియాంక.. త్వరలోనే అతడిని పెళ్లాడనుందని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో జూమ్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక వెల్లడించిన విషయాలు ఆసక్తికరంగా మారాయి.

పెళ్లి గురించి మీ అభిప్రాయమేమిటని హోస్ట్‌ అడగగా.. ‘ పెళ్లి గురించి ప్రస్తుతానికైతే ఎలాంటి ఆలోచనా లేదు. కానీ మా ఆంటీ ఈ విషయమపై చాలా తీవ్రంగా బాధ పడుతున్నారు. అందుకే టీవీ నటుడు మోహిత్‌ రైనా(మహదేవ్‌ ఫేమ్‌- హర హర మహదేవ శంభో శంకర)తో నా పెళ్లి కుదుర్చాలని భావించారు. మోహిత్‌ ప్రవర్తన, నిజాయితీ, తన నటనా కౌశల్యం ఆమెకు ఎంతగానో నచ్చాయి. అందుకే మోహిత్‌ను పెళ్లి చేసుకోవాల్సిందిగా నాకు సలహా ఇచ్చారంటూ’  ప్రియాంక వ్యాఖ్యానించారు.

ప్రియాంక చెప్పిన విషయాలు విన్న మోహిత్‌ ఆశ్చర్యానికి గురైనట్లు సదరు టీవీ చానెల్‌ పేర్కొంది. కాగా ప్రస్తుతం సర్పరోష్‌ సర్‌గర్హీ 1897 సీరియల్‌లో నటిస్తోన్న మోహిత్‌ రైనా ‘నాగిని’  ఫేం మౌనీ రాయ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement