హైదరాబాద్ : తమిళ ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎన్నాళ్ల నుంచో టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌తో ఎట్టకేలకు తెలుగు ప్రేక్షకులను పలుకరించేందుకు ఆమె సిద్ధమయ్యారు. సందీప్ కిషన్, హన్సికా మోత్వానీలు ప్రధాన పాత్రల్లో కనిపించే ఈ సినిమాకు నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. ఆమె నటించిన తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకుండానే వరలక్ష్మి మరో తెలుగు సినిమాకు సైన్ చేశారు.
తాజా సమాచారం ప్రకారం మాస్ మహారాజా తదుపరి సినిమాలో ఆమె కీలక పాత్రలో మెరవనున్నారు. ఆర్‌టీ66 వర్కింగ్ టైటిల్‌గా రవితేజ, శ్రుతిహాసన్‌లు ప్రధాన పాత్రల్లో గోపిచంద్ మలినేని నిర్ధేశకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. టాగూర్ మధు నిర్మించే ఈ సినిమా త్వరలో సెట్స్‌పై అడుగుపెట్టనుందని నిర్మాతలు ధ్రువీకరించారు. వరలక్ష్మి సహా పలువురు దిగ్గజ నటులు ఈ మూవీలో నటించనున్నారని సమాచారం. రవితేజ మరోసారి పోలీస్ అధికారిగా కనిపించే ఈ మూవీకి ఎస్‌ఎస్ తమన్ సంగీతం సమకూర్చుతారు. వరలక్ష్మి మారి 2, పందెం కోడి సహా పలు చిత్రాల్లో తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment