సల్మాన్ ఖాన్
... అంటున్నారు సల్మాన్ ఖాన్. పెళ్లి చేసుకుంటేనే కదా పిల్లలు పుట్టేది అని భాయ్‌కి తెలియదంటారా? తెలుసు. అయినా పిల్లలు కోసం పెళ్లి చేసుకోలేనంటున్నారు. కానీ పిల్లలు కావాలట. సల్మాన్‌కు చిన్న పిల్లలంటే ఎంత ఇష్టమో తెలిసిందే. బంధువుల పిల్లలతో సరదాగా ఆడుకునే ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు సల్మాన్. 53 ఏళ్ల వయసున్న భాయ్ ఇంకా బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరే.
పెళ్లి టాపిక్ వస్తే మాట దాటేస్తారు. తాజాగా అదే చేశారు. ‘‘పెళ్లి ఆలోచన ప్రస్తుతానికైతే లేదు. కానీ పిల్లలు మాత్రం కావాలి. ఆ పిల్లలను చూసుకోవడానికి నా దగ్గర పెద్ద సామ్రాజ్యమే ఉంది. అయితే ఆ పిల్లలను పుట్టించడానికి తల్లి కావాలి. కానీ నాకు అవసరం లేదు (అంటే.. భార్య అవసరం లేదు అని)’’ అని పేర్కొన్నారు సల్మాన్. మరి.. భార్య లేకుండా సల్మాన్ ఎలా తండ్రి అవుతారు? ‘సరోగసీ’ ద్వారా కావాలనే ఆలోచన ఉందేమో.
Comments
Please login to add a commentAdd a comment