ఆగలేదండీ బాబు! | Vikram Mahavir Karna teaser to reveal cast and crew details | Sakshi
Sakshi News home page

ఆగలేదండీ బాబు!

Published Tue, Jul 2 2019 5:39 AM | Last Updated on Tue, Jul 2 2019 5:39 AM

Vikram Mahavir Karna teaser to reveal cast and crew details - Sakshi

విక్రమ్‌ ‘మహావీర్‌ కర్ణ’ సినిమా ఆగిందా? చెన్నై కోడంబాక్కమ్‌లో జరుగుతున్న చర్చల్లో ఇదొకటి. మహాభారతంలోని ‘కర్ణుడి’ పాత్ర ఆధారంగా ఆర్‌.ఎస్‌. విమల్‌ దర్శకత్వంలో యునైటెడ్‌ ఫిల్మ్‌ కింగ్‌డమ్‌ సంస్థ ఈ చిత్రాన్ని ప్రకటించింది. దాదాపు ఏడాది క్రితం ఈ సినిమాకి సంబంధించిన వార్త బయటికొచ్చింది. తమిళ్, హిందీ భాషల్లో మొత్తం 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. అయితే ఇప్పుడీ సినిమా గురించి చడీ చప్పుడూ లేకపోవడంతో ప్రాజెక్ట్‌కి బ్రేక్‌ పడిందనే వార్త ప్రచారంలోకొచ్చింది. సినిమా ఆగలేదండీ బాబు.. ప్రస్తుతం లొకేషన్స్‌ వెతికే పనిలో ఉన్నామని యూనిట్‌ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రీ–ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రం ఫొటోషూట్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement