పుట్టిన రోజే అలియాభట్ ఎందుకు ఏడ్చేసింది?
ముంబయి: పుట్టిన రోజు వేడుకలంటే.. సాధారణంగా పండుగ వాతావరణంతో నిండిఉంటాయి. సరదాలుసంతోషాలు ఆ రోజు ఇంట్లో వెళ్లి విరుస్తాయి. ముఖ్యంగా ఆ పుట్టిన రోజు జరుపుకుంటున్న వ్యక్తి ముఖం ఆ రోజంతా నిండా విచ్చుకున్న తామరలా ఉంటుంది. కానీ, ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ మాత్రం తన పుట్టిన రోజు ఏడ్చేసింది.
అయితే అదేదో బాధతో కాదు. ఆనంద పరవశంతో.. కళ్లతో కాదు హృదయంతో.. బహుషా ఏ స్నేహితుల మధ్య గడిపినా దక్కని ఆనందం.. లక్షలు ఖర్చుపెట్టి ఏ లగ్జరీ హోటల్లో పుట్టిన రోజు జరుపుకున్నా దొరకని సంతోషం అలియా సొంతమైంది. ఆమె తాతబామ్మలు స్వయంగా పుట్టిన రోజు గీతాన్ని సంగీత రూపంలో వాయిస్తూ ఆమెకు విషెస్ చెప్పడంతో ఆ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్లో బందిస్తూ హృదయం ఉప్పొంగి ఏడ్చేసింది. అది కూడా అలియా ఎనిమిదేళ్ల ప్రాయంలో ఉండగా. ఈ మెమొరబుల్ వీడియోను పుజాభట్ ఇన్స్టాగ్రమ్ ద్వారా పంచుకుంది.