ఫుల్లుగా తాగిన డాక్టర్ ఏం చేశాడంటే..!
బెంగళూరు: అతడు ఓ డాక్టర్. వైద్యం చేసి మనుషుల ప్రాణాలు నిలబెట్టేవాడు. కానీ, పీకలదాక తాగేసి రోడ్డుపై అడ్డుగోలుగా వాహనం నడిపి ఓ స్కూటరిస్టులను మరో నలుగురిని ఢీకొట్టాడు. దీంతో ఆ స్కూటరిస్టు చనిపోగా.. మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఈఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని బనాశంకరీ థర్డ్ ఫేజ్ లోగల ఐటీఐ కాలనీకి చెందిన డాక్టర్ ఎన్ఎస్ శంకర్ అనే వ్యక్తి జయానగర్ థర్డ్ బ్లాక్ లో ఆర్థోపెడిక్ క్లినిక్ నడుపుతున్నాడు.
అతడు ఆదివారం సాయంత్రం ఫుల్లుగా మద్యం సేవించి కారును వేగంగా నడిపాడు. అది కాస్త అదుపుతప్పి స్కూటరిస్టును ఢీకొనడమే కాకుండా ఓ రేకుల ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో సరిత అనే తన ఇంట్లో పనిచేసే మహిళ, ఆమె రెండేళ్ల కూతురు ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. వైద్యుడు మాత్రం గాయపడ్డాడు. ఘటన స్థలికి వచ్చిన పోలీసులు అతడిని అరెస్టు చేసి అనంతరం ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించి స్టేషన్కు తీసుకెళ్లారు.