‘అద్వానీజీ బాధ నాకు అర్థమైంది’ | 'I understand Advaniji's pain,' says LS Speaker | Sakshi
Sakshi News home page

‘అద్వానీజీ బాధ నాకు అర్థమైంది’

Published Thu, Dec 15 2016 7:29 PM | Last Updated on Sat, Mar 9 2019 3:08 PM

‘అద్వానీజీ బాధ నాకు అర్థమైంది’ - Sakshi

‘అద్వానీజీ బాధ నాకు అర్థమైంది’

న్యూఢిల్లీ: తాను బీజేపీ అగ్ర నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్‌ కే అద్వానీ బాధను అర్థం చేసుకున్నానని లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ అన్నారు. ఉభయ సభల్లో సభ్యుల ప్రవర్తన, మొత్తం సమావేశ కాలాన్ని వృధా చేస్తున్న అంశాన్ని చూసే అద్వానీ మదనపడుతున్నారని, ఆ విషయం తనకు అర్థమైందని చెప్పారు.

పార్లమెంటులో అర్థమంతమైన చర్చలు జరగాలని, సభ సజావుగా జరిగేలా చూడటం ప్రతి సభ్యుడి కర్తవ్యం అని ఆమె అన్నారు. అంచనాకు తగినట్లుగా సమావేశాలు మాత్రం జరగడం లేదని, పూర్తి విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆమె కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరును చూసి తనకు రాజీనామా చేయాలని పిస్తుందంటూ అద్వానీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement