న్యూఢిల్లీ: లోక్‌సభ సాధారణ ఎన్నికలు ఇప్పుడే జరిగితే ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మీడియా సంస్థ టైమ్స్‌గ్రూప్ చెబుతోంది. తాము జరిపిన ఓ ఆన్‌లైన్ సర్వేలో పాల్గొన్నవారిలో నాలుగింట మూడొంతుల మంది...ఇప్పుడే ఎన్నికలొస్తే మోదీకే ఓటేస్తామని చెప్పారంది. 2019లోనూ మోదీ సర్కారే అధికారంలోకి వస్తుందని 79 శాతం మంది అభిప్రాయపడగా, కాబోయే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గెలుస్తారని 20 శాతం మంది నమ్మకంతో ఉన్నారని సర్వేలో వెల్లడైంది.
సర్వేలో పాల్గొన్న తెలుగువారిలో 48 శాతం మంది మోదీకి మద్దతు పలకగా రాహుల్ పక్షాన 46 శాతం మంది నిలిచారు. తమిళుల్లో 58 శాతం మంది రాహుల్‌కు, 30 శాతం మంది మోదీకి మద్దతు తెలిపారు. మలయాళీల్లో 55 శాతం మంది రాహుల్ పక్షాన, 39 శాతం మంది మోదీ పక్షాన నిలిచారు. డిసెంబరు 12 నుంచి 15 మధ్య 9 భాషల్లోని తమ వెబ్‌సైట్లలో టైమ్స్ గ్రూప్ ఈ ఆన్‌లైన్ సర్వే చేసింది. రాహుల్ పార్టీ అధ్యక్షుడైనా సరే, కాంగ్రెస్‌ను తాము బీజేపీకి ప్రత్యామ్నాయంగా చూడబోమని 73 శాతం మంది చెప్పారు. గాంధీల కుటుంబం పార్టీ అధ్యక్ష స్థానంలో లేకపోతేనే తాము కాంగ్రెస్‌కు ఓటేస్తామని 37 శాతం మంది చెప్పగా, వారు నాయకులైతేనే కాంగ్రెస్ పక్షాన ఉంటామని 38 శాతం మంది చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment