బీజింగ్/న్యూఢిల్లీ : భారత్, చైనా మధ్య ఇప్పటికే అనేక అంశాల్లో తీవ్ర పోటీ, ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా మరో ఇరు దేశాల మధ్య మరో హోరాహోరీ పోరుకు రంగం తెర లేచింది. అంతరిక్ష రంగంలో భారత్, చైనాలు తమదైన శైలిలో దూసుకు పోతున్నాయి. ఇదే క్రమంలో ఇరు దేశాలు అంతరిక్ష వాణిజ్యం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. వాణిజ్య రంగంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైనాకన్నా అడుగు ముందే ఉంది. ఈ నేపథ్యంలో చైనా అంతరిక్ష వాణిజ్యంలో తమ ధరలను భారీగా తగ్గిస్తూ.. ఇస్రోకు సవాలు విసిరింది. రాకెట్ లాంచింగ్ ప్రోగ్రామ్‌లో ధరలను తగ్గించడం అనేది ఇస్రోను ఆర్థికంగా దెబ్బతీసే అంశం.
చైనా ఏరెస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పోరేషన్ (సీఏఎస్‌సీ) తీసుకున్న నిర్ణయంపై ఇస్రో ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ఇస్రో కూడా ఇదే దారిలో ఉందని.. రాకెట్ లాంచింగ్‌లో ధరలను తగ్గించే ఆలోచన చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇస్రో ఇప్పటికే ఒకేసారి మైక్రో, నానో, మిని, స్టాండర్డ్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి.. ఖర్చును బాగా తగ్గించుకుందని.. ఈ నేపథ్యంలో ధరలను మరింత తగ్గించడం పెద్ద కష్టమేం కాదని ఇస్రో అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment