మావో డిప్యూటీ కమాండర్‌ మృతి | Mao deputy commander killed in encounter | Sakshi
Sakshi News home page

మావో డిప్యూటీ కమాండర్‌ మృతి

Published Sat, Oct 13 2018 5:23 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

Mao deputy commander killed in encounter - Sakshi

పర్ణశాల(భద్రాద్రి కొత్తగూడెం): ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్‌ కవాసి దేవా మృతి చెందారు. జిల్లా సరిహద్దుల్లో ఉన్న పుస్నార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తులసీ కొండల్లో గురువారం మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు రెండు గంటలపాటు ఈ కాల్పులు కొనసాగాయి. అనంతరం మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోగా పోలీసులు సంఘటన స్థలంలో ఓ మావోయిస్టు మృతదేహం, ఒక తుపాకీతోపాటు బాంబు తయారీకి వాడే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement