'నా వెనుక 125 కోట్ల మంది ప్రజలున్నారు'
ఢిల్లీ: బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రో ధరలు తగ్గుముఖం పట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్రంలో బాధ్యాయుతమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లు.. ఢిల్లీలో కూడా మంచి ప్రభుత్వం కావాలని ఆయన సూచించారు. ఆదివారం ఎన్నికల ప్రచారసభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఢిల్లీ ప్రభుత్వం బాధ్యతలు ఒకరికి అప్పగిస్తే వారు పారిపోయారని.. ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. తన వెనుక రూ.125 కోట్ల మంది ప్రజలు ఉన్నారనేది ప్రతీ క్షణం గుర్తుంచుకుంటానని మోదీ తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే తమ లక్ష్యమన్నారు.