విధానసభ ఎన్నికలు ఆచితూచి ఆప్ ముందడుగు | AAP releases first list of 22 candidates for Delhi elections | Sakshi
Sakshi News home page

విధానసభ ఎన్నికలు ఆచితూచి ఆప్ ముందడుగు

Published Tue, Nov 25 2014 11:13 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

AAP releases first list of 22 candidates for Delhi elections

సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో  నరేంద్ర మోదీ ప్రభంజనం ప్రభావాన్ని తట్టుకుని గెలవడం కోసం గట్టి అభ్యర్థులు అవసరమనే విషయాన్ని  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుర్తించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. నిజాయి తీ, విశ్వసనీయత కలిగిన కార్యకర్తలుగా ముద్రపడినవారికే టికెట్లను కేటాయించే దిశగా కసరత్తు చేస్తోంది. ఎన్నికల ప్రచారరంలో తమ పార్టీ అభ్యర్థులు మిగతా పార్టీల అభ్యర్థుల కన్నా ముందుండాలనే ఉద్దేశంతో ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 22 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ఆప్ ఇప్పటికే విడుదల చేసింది. ఇందు లో ఆప్ సర్కారులో మంత్రులుగా ఉన్న నలుగురి పేర్లతో పాటు 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు కూడా అందులో ఉన్నాయి. అభ్యర్థుల రెండో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి లేదా రెండు రోజులలో విడుదల చేసే అవకాశముంది.
 
 రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం సమావేశమై రెండో జాబితాలో ప్రకటించే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిందని, ఈ నెల 28వ తేదీనవిడుదల చేసే అవకాశముందని ఆ  పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ జాబితాలో  20 మంది పేర్లు ఉండొచ్చని, వారిలో ఏడు పేర్లు కొత్తవని అంటున్నారు. గత విధానసభ ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన్పపటికీ చిత్తశుద్ధితో పనిచేసే వారికి రెండో జాబితాలో చోటు కల్పించనున్నారు. రాఖీబిర్లాతోపాటు అల్కా లాంబా, దేవేంద్ర  సెహ్రావత్, గోపాల్‌రాయ్ తదితరుల పేర్లు ఉండొచ్చని అంటున్నారు. అల్కా లాంబా ఆప్ తర పున విధానసభ ఎన్నికలలో దిగనున్న కొత్త ముఖం కాగా రాఖీ బిర్లా గత ఎన్నికలలో మంగోల్‌పురి నుంచి విజయం సాధించారు. గోపాల్‌రాయ్.. బాబర్‌పుర్  నియోజకవర్గంనుంచి పోటీచేసి ఓడిపోయారు. దేవేంద్ర సెహ్రావత్ కూడా విధానసభ ఎన్నికల్లో బిజ్వాసన్ నియోజకవర్గం నుంచి పోటచేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత ఆయన లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి మళ్లీ పరాజయం పాలయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement