నేపాల్‌తో బంధం బలోపేతం
కఠ్మాండూ: ప్రపంచ శాంతికి, భద్రతకు ఉగ్రవాదమే భారీ ముప్పు అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం నేపాల్‌లో అన్నారు. ఈ భూతాన్ని తరిమికొట్టడానికి అన్ని దే శాలు కలిసి పనిచేయాలని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ప్రణబ్ మూడు రోజుల పర్యటన కోసం నేపాల్ చేరుకున్నారు. ఒక భారత రాష్ట్రపతి నేపాల్ పర్యటనకు వెళ్లడం గత 18 ఏళ్లలో ఇదే తొలిసారి. నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి ఇచ్చిన విందును ప్రణబ్ స్వీకరించారు. ప్రాంతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉందని ప్రణబ్ స్పష్టం చేశారు.
భారత్ నేపాల్‌తో 1,850 కి.మీ సరిహద్దును పంచుకుంటోంది. గతేడాది నేపాల్ కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చిన సమయంలో భారత్‌తో ఆ దేశ ద్వైపాక్షిక సంబంధాలు బలహీన పడ్డాయి. కొత్త రాజ్యాంగాన్ని నేపాల్‌లోని మాదేశీలు తీవ్రంగా వ్యతిరేకించారు. మాదేశీలలో ఎక్కువ మంది భారత సంతతి వారు ఉన్నారు. తాజా ప్రణబ్ పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడానికి అవకాశం ఉంది.