ఈ వ్యవ‘సాయం’తో మరో గాయం | Chandrababu regime fell to the production of food grains | Sakshi
Sakshi News home page

ఈ వ్యవ‘సాయం’తో మరో గాయం

Published Wed, Nov 26 2014 12:05 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

ఈ వ్యవ‘సాయం’తో మరో గాయం - Sakshi

ఈ వ్యవ‘సాయం’తో మరో గాయం

చంద్రబాబు హయాంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయి, పండినా గిట్టుబాటు ధరలు లేక, కనీస పెట్టుబడులు రాక, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే స్థితి వచ్చింది. అయినా రైతు రుణాలు రద్దు కాదుకదా, కనీసం వడ్డీ రద్దు కూడా ప్రకటించలేదు. 22 జిల్లా కేంద్ర సహకార సంఘాలలో 18 దివాలా తీసే పరిస్థితి వచ్చింది.  
 
వ్యవసాయానికి మొదట అవసరమయ్యేది సకాలం లో పెట్టుబడి. ఈ సౌక ర్యం లేకే రైతు ఆర్థిక సం క్షోభంలో చిక్కుకుంటు న్నాడు. ఈ బాధ నుంచి రైతుకు విముక్తి కలిగించ డానికి కొంత ప్రయత్నం జరిగింది. కానీ ప్రైవేట్ వ్యాపారుల బారి నుంచి రైతులను తప్పించి వడ్డీభారాన్ని ముందుగా ఉన్న 11% నుంచి ‘0’% వరకు తీసుకువచ్చిన క్రమంలో  చంద్రబాబు పాత్ర, ప్రమేయం, కనీసం ఆలోచన ఏ దశలోనూ లేదు. ఇప్పుడు ఆయన రైతులను ఆదు కుంటానని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

రుణ బాధ నుంచి రైతులు బయట పడాలంటే రైతుల భాగస్వామ్యంతో ఉండే సంస్థల ద్వారా సకా లంలో రైతులకు రుణాలు అందించాలని బ్రిటిష్ పాలనలోనే ’నికల్సన్‌‘ అనే ఐసీఎస్ అధికారి ఇచ్చిన రిపోర్టు మేరకు వచ్చిందే సహకారచట్టం. ఈ చట్టం ఫలితమే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా లు. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయంచేసి, ప్రతీ బ్యాంకు వ్యవసాయరంగానికిచ్చే 18% రుణా లను 11% వడ్డీకే ఇవ్వాలని, వ్యవసాయరంగాని కిచ్చే 18% రుణాలలో 13% డెరైక్ట్ రుణాలుగా రైతు లకు స్వల్పకాల, దీర్ఘకాల పంటరుణాలుగా ఇవ్వా లని చట్టం తీసుకువచ్చారు. 5% ఇన్‌డెరైక్టు రుణా లుగా అంటే వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, వ్యవసాయ యాంత్రీ కరణ తయారీ పరిశ్రమలకు ఇవ్వాలని కూడా ఆ చట్టంలో ఉంది. వ్యవసాయోత్పత్తుల ధరలను ప్రభుత్వం నియంత్రించటం మూలంగా, పెరుగు తున్న పెట్టుబడులకు అనుగుణంగా ధరలు పెరగ టంలేదు. కాబట్టి రైతులను కొంతవరకైనా ఆదుకో వాలని భావించి ఎన్.టి.రామారావు, రైతులు తమ రుణాలను మార్చి 31 లోపు చెల్లిస్తే సహకార బ్యాం కుల్లో ఐదున్నర శాతం వడ్డీ రాయితీ ఇప్పించారు. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉండగా రైతులకు బ్యాంకులు ఇచ్చే 13% రుణాలపై వడ్డీని 11% నుండి 9% తగ్గిస్తూ పార్లమెంటులో చట్టం తీసుకొచ్చా రు. యూపీఏ ప్రభుత్వం ఈ 9% వడ్డీలో 2% వడ్డీ కేంద్రప్రభుత్వం బ్యాంకులకు చెల్లించి, రైతులకు వడ్డీని 7% తీసుకు వచ్చింది. ఆ తర్వాత కాలంలో మన రాష్ట్రంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశే ఖరరెడ్డి రైతు రుణాలను 3% అంటే పావలా వడ్డీకి తీసుకువచ్చారు.

ఆర్థిక సంక్షోభంలో ఉన్న రైతుకు కొంతవరకైనా రుణభారం తగ్గించాలనే ఆలోచనతో మొట్టమొద టిసారిగా దేవీలాల్ ఉప ప్రధానిగా ఉండగా ‘ఏఆర్ ఆర్-1900’ పథకం ద్వారా 01-10-1989 నాటికి వాయిదా మీరిన రైతుల, గ్రామీణ చేతివృత్తుల వారికి రుణం ఎంతవున్నా రూ.10,000 వరకు రద్దు ప్రకటించి దేశవ్యాప్తంగా రూ.6,000 కోట్లు రద్దు చేశారు. యూపీఏ-1 హయాంలో అగ్రికల్చర్ డెట్ వైపర్ అండ్ డెట్ రిలీఫ్ 2008 పథకం పేరుతో 31- 12-2007 నాటికి రుణం తీసుకుని 29-09-2009 నాటికి వాయిదా మీరి ఉండి పథకం ప్రకటించే నాటికి అప్పు చెల్లించకుండా ఉన్న సన్న, చిన్నకారు రైతులకు మాత్రం మొత్తం బకాయిలు రద్దు, మిగి లిన రైతులకు వన్ టైమ్ సెటిల్‌మెంట్‌గా 75% బాకీని చెల్లిస్తే 25% రాయితీని అమలు చేయటం ద్వారా దేశవ్యాప్తంగా రద్దయిన రుణాలు రూ.65, 318 కోట్లు. దేశ చర్రితలోనే ఈ రుణాల రద్దు సకా లంలో సక్రమంగా బాకీ చెల్లించే రైతులకు లబ్ధి జర గలేదని గ్రహించి 36 లక్షల మంది రైతులకు ఒక్కొ క్కరికీ రూ.5,000 వంతున ప్రోత్సాహకాలు  అం దించిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల రుణాల రద్దుకు ముందుకు రాలేదు.

చంద్రబాబు హయాంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయి, పండినా గిట్టుబాటు ధరలు లేక, కనీస పెట్టుబడులు రాక, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే స్థితి వచ్చింది. అయినా రైతు రుణాలు రద్దు కాదుకదా, కనీసం వడ్డీ రద్దు కూడా ప్రకటించలేదు. రాష్ట్రంలో 22 జిల్లా కేంద్ర సహకార సంఘాలలో 18 దివాలా తీసే పరిస్థితి వచ్చింది.  ఇప్పుడు అనంతపురం జిల్లాలో పాద యాత్రలో రైతుల పరిస్థితికి మనసు కరిగి, వ్యవ సాయ రుణాల రద్దుకు నిర్ణయం తీసుకున్నానని చంద్రబాబు ప్రకటించారు. 9 ఏళ్లు సీఎంగా, 8 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నపుడు నోరు మెదపకుండా, 2012లో ‘నా మనసు ద్రవించిపోయింద’ని చెప్ప డం మొత్తం రైతాంగాన్ని మోసం చేయడమే. మరొక అడుగువేసి  రుణాలను కట్టవద్దని, తాను అధికారం లోకి రాగానే రైతులు తాకట్టు పెట్టుకున్న దస్తావే జులు, పుస్తెలతాళ్లు మీ ఇంటికి తెచ్చి ఇస్తారని ఊరూరా ప్రచారం చేయించారు.

రైతుల పంట రుణాలతో పాటు హెరిటేజ్ ఫ్రెష్ తీసుకున్న రుణాలను కూడా రద్దు చేస్తామని అంటు న్నారు. ఇదెలా అని అడిగితే  ‘ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నా. నాకు అన్నీ తెలుసు’ అంటూ వ్యవ సాయ రుణాలన్నీ రద్దు చేస్తామని ఎన్నికల కమి షన్‌కు లేఖ రాశారు. జూన్ 12వ తేదీన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రోజు ఉదయం అన్ని పత్రికల్లో రాష్ర్ట ప్రభుత్వం తరఫున సమాచార ప్రసార శాఖ అధికారికంగా వ్యవసాయ రుణాల రద్దు గురించి  చేసిన ప్రకటనలు కూడా ఉన్నాయి. కానీ జరిగినది- కోటయ్య కమిటీ నియామకం. వ్యవసాయ రుణా లు, పంట రుణాలు అయ్యాయి. తరువాత హామీని ఇంకా పలచబరుస్తూ, నేడు ఆధార్ కార్డు ఉంటేనే రద్దు అంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలకై స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తాం అని కూడా చంద్రబాబు చెప్పారు. రూ.5,000 కోట్ల తో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు వాటి ఊసే లేదు. ఎవరినీ మోసం చెయ్యనిది,  మోసం చెయ్యాలనే ఆలోచన లేని వాళ్లు రైతులే. దేశానికి అన్నం పెట్టే అలాంటి రైతును మోసం చేస్తున్న వ్యక్తి క్షమార్హుడు కాదు.
 
(వ్యాసకర్త వైఎస్సార్‌సీపీ  రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు)  - ఎం.వి.ఎస్. నాగిరెడ్డి
http://img.sakshi.net/images/cms/2014-11/41416941601_Unknown.jpg
 


 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement