రాజధాని నిర్మాణంలోనూ వాళ్లే సమిధలు | They samidhalu capital structure | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణంలోనూ వాళ్లే సమిధలు

Published Tue, Feb 10 2015 12:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

దుడ్డు ప్రభాకర్ - Sakshi

దుడ్డు ప్రభాకర్

నవ్యాంధ్ర రాజధానిలో ఇళ్లు, సమాధులతో సహా సర్వం కోల్పోయే అట్టడుగు కులాల ప్రజలు, అడ్డాకూలీలుగా బతకాల్సివస్తుంది. చంద్రబాబు రాజధాని ప్రాంత మహిళల్నీ అడ్డాకూలీలుగా నిలబెట్టబోతున్నారు.
 
ప్రజలందరి సలహాలు, సూచనల మేరకు  అందరి భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పిన చంద్రబాబు కనీసం రాజధాని ప్రాంత అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవ డం లేదు. స్థానికుల అభిప్రా యాలకు భిన్నంగా పచ్చని పంటల పొలాల్లో రాజధాని కట్టడానికి పట్టుదలతో ఉన్నారు. పైగా, విమర్శకులను..13 జిల్లాలకు కేంద్రంగా ఉన్న గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మా ణాన్ని  వ్యతిరేకించే వాళ్లుగా ప్రచారం చేస్తున్నారు.
 
రాజధాని ప్రాంతంలోని కౌలు రైతులను, రైతు కూలీలను మొత్తం 12 వేల కుటుంబాలుగా ప్రభుత్వం తేల్చింది. భూసేకరణ ద్వారానో, భూ సమీకరణ ద్వారా నో, నయానో, భయానో రైతుల నుండి ప్రభుత్వం భూమి లాగేసుకొని ప్యాకేజీ ఇస్తుందనుకుందాం. మరి మెజారిటీ కౌలు రైతులైన అగ్రకులాల్లోని పేదలు, దళి తులు, బీసీలు, ముస్లింల పరిస్థితేంటి? వ్యవసాయాధా రిత వృత్తి కులాలు జీవించేదెలా? మరీ ముఖ్యంగా రైతు కూలీలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు, మహిళల పరిస్థితి దయనీయంగా మారనుంది.
 
ప్రభుత్వ లెక్కల ప్రకారం  రాజధాని ప్రాంత పరిధి లోని గ్రామాలలో మొత్తం 22,404 మంది రైతులు న్నారు.  వారిలో రెండెకరాలు ఉన్న రైతులు 16 వేల మంది ఉన్నారు. సగానికిపైగా భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారు. వారిలో సుమారు 10 వేల మంది రైతులు లంబాడీలు, బీసీలు, ముస్లింలు ఉన్నారు. వారి బతుక్కి ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏమీ లేదు. వ్యవసా యాధారిత వృత్తికులాలైన వడ్రంగి, కంసాలి కులస్థులు, కల్లుగీసే వారి బతుకులు రాజధాని నిర్మాణంలో ఛిద్రం కాబోతున్నాయి.  

అంతేకాదు. పంటలు కోసిన తర్వాత ఖాళీ భూముల్లో గొర్రెల మందల్ని తోలి, పెంటగట్టి తాము బతుకుతూ, సేంద్రియ ఎరువులను అందిస్తూ రైతులకు ఆసరాగా ఉన్న గొల్ల కులస్తులూ ఆందోళనలో ఉన్నారు. నాట్లు వేసే ముందు పొలాల్లో బాతుల్ని వదిలి బతుకు బండి లాక్కొస్తున్న ఎరుకల కులస్తులు, పంట లను కంటికి రెప్పలా కాపాడుతూ రేయింబవళ్లు కాపలా కాస్తున్న యానాదుల బతుకులు తెల్లారేదెలా? వీరే కాదు. పంట భూముల్లోని పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పూలను రైతుల వద్ద నుండి కొని గంపల్లో, తోపుడు బండ్లపై అమ్ముకొని పొట్టపోసుకునే కుటుం బాలు,  పొలాల నుండి సరుకులను మార్కెట్‌కు తర లించే ఆటోవర్కర్ల జీవితం అగమ్యగోచరం కానుంది.
 
మహిళా సాధికారత, గురించి మాట్లాడే చంద్ర బాబు రాజధాని ప్రాంత మహిళల్ని అడ్డాకూలీలుగా నిల బెట్టబోతున్నారు. తోటలకు పురుగుమందులు కొట్టడం, అరక దున్నడం మినహాయిస్తే మిగిలిన పనులన్నీ  మహి ళలే చేస్తారు. విత్తనాలు నాటడం, పాదులు తీయడం, కలుపుతీయడం, పందిళ్లు కట్టడం, కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, పూలు కోయడం, వాటిని ప్యాక్ చేయ డం లాంటి పనులన్నీ మహిళలే చేస్తారు. వరినాట్లు, కలు పులు, కోతలు, మెట్ట ప్రాంతాల్లో మిరపకాయలు కోయ డం, గ్రేడ్ చేయడం, పత్తి ఏరడం లాంటి పనులలో పూర్తిగా మహిళలు, బాలికలే పాల్గొంటారు.

తెనాలి, దుగ్గిరాల, పల్నాడు ప్రాంతాల నుండి ప్రతి రోజూ 2, 3 వేల మంది మహిళలు సుమారు 30, 35 కి.మీ దూరం నుండి ఆటోలలో వచ్చి పనులు చేసి వెళుతూ ఉంటారు. మగవారు తాగుడుకి బానిసలై ఉన్న అనేక కుటుం బాలలో స్త్రీలే కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకొని నెట్టు కొస్తున్నారు. నేటికీ పంట పొలాల్లో, కల్లాల దగ్గర ‘పరిగె’ ఏరుకొని పైటకొంగుల్లో ఇంటికి తీసుకొచ్చి బిడ్డ లకు కడుపునింపే మాల, మాదిగ, యానాది కులాలకు చెందిన ముసలి తల్లులు ఆ ప్రాంతంలో ఉన్నారు.
 
వీళ్లందర్ని కలుపుకుంటే సగటున ఎకరాకు 5 మంది చొప్పున రాజధాని ప్రాంత భూముల్లో మొత్తం 2,50,000 మంది రైతు కూలీలుగా వ్యవసాయాధారిత వృత్తుల్లో జీవిస్తున్నారు.  వీరిలో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లింలలోని మహిళలు. కానీ ప్రభుత్వం కౌలు రైతులు, రైతు కూలీలను కలిపి 12 వేల కుటుంబాలుగా లెక్కగట్టింది. వారికి నెలకు 2500 ఇస్తానంటుంది. అంటే రోజుకి రూ.800. నిత్యావసర వస్తువులు, విద్య, వైద్యం పేద ప్రజలకు అందని పండుగా ఉన్న నేటి ఆర్థిక స్థితిలో రూ.80 ఒక్కపూటైనా బిడ్డలకు  బువ్వపెట్టుకోవడానికి సరిపోవు. ఇప్పటిదాకా ఎక్కువగా పురుషులే అడ్డాకూలీ లుగా బతుకుతున్నారు. ఇక నుండి నవ్యాంధ్రలో మహి ళలు అడ్డాలు కూడా చూడబోతున్నాము.
 
ఎన్నికల హామీలు నెరవేర్చకపోయినా ఫర్వాలేదు. కానీ మట్టికి, మనిషికి ఉన్న బంధాన్ని, భూమికి, బువ్వ కు ఉన్న సంబంధాన్ని తుంచకూడదు. ప్రజలను భిక్ష గాళ్లను చేసి పంట భూముల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేయడం ప్రజాద్రోహం. రాజధాని నిర్మాణ సమస్య అధి కార, ప్రతిపక్ష పార్టీల సమస్య కాదు. ఆ ప్రాంత రైతు లకూ, ప్రభుత్వానికీ మధ్య సమస్య మాత్రమే కాదు. ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) ల్యాండ్ అక్విజేషన్ (భూసేకరణ) మరియు ప్యాకేజీల సమస్య అంతకంటే కాదు. కౌలు రైతులు, రైతు కూలీలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు, మహిళల బతుకు సమస్య. బతుకుదెరువు సమస్య. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలం దరి సమస్య. అందుకే పచ్చని పంట పొలాల్లో రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిద్దాం. అన్ని ప్రాంతాల సమాన అవ కాశాల కోసం, సమాన అభివృద్ధి కోసం ఉద్యమిద్ధాం. రాజధాని నిర్మాణం, అభివృద్ధిని రాయలసీమ, ఉత్తరాం ధ్ర, పల్నాడు ప్రాంతాలలో వికేంద్రీకరించాలని పోరా డుదాం.

(వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాటసమితి) మొబైల్ : 9959567818

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement