సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో విలువలు కాలరాస్తూ, నియంతృత్వ పోకడలకు తెలంగాణ శాసనసభ వేదికైందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టు విక్రమార్క ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత శాసనసభ్యులకి ఇవ్వాల్సిన గౌరవం, వసతులు ఇవ్వాల్సిందేనన్నారు.
స్పీకర్, సెక్రటరీలను కలిసి కోర్టు తీర్పును ఇచ్చినట్టు ఆయన తెలిపారు. తీర్పు అమలు చేయకపోతే కోర్టు ధిక్కారం కిందుకు వస్తుందన్నారు. శాసనసభ్యలు అంశంపై తీర్ప వచ్చి ఇన్ని రోజుల తర్వాత కూడా కాలయాపన చేయడం మంచిది కాదన్నారు. ప్రభుత్వ తీరుతో రాజ్యాంగ సంక్షోభం వచ్చే ప్రమాదం తీసుకు రావద్దని భట్టి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment