‘జేడీఎస్‌’లో పాటల సందడి | JDS Party Use Old Songs In Election Campaign | Sakshi
Sakshi News home page

‘జేడీఎస్‌’లో పాటల సందడి

Published Mon, Apr 30 2018 9:52 AM | Last Updated on Wed, Sep 5 2018 1:55 PM

JDS Party Use Old Songs In Election Campaign - Sakshi

సాక్షి, బెంగళూరు: ‘నానిరువుడే నిమ్మగాగి.. నడిరువుడు నమగాగి..’ పాట 1970లో కన్నడ నాట ఉర్రూతలూగిచ్చింది. ఈ పాట ఇప్పుడు కర్ణాటకలోని ఎన్నికల ప్రచారంలో మార్మోగుతోంది. కన్నడ ఎన్నికల సమరంలో కీలకంగా మారిన జేడీఎస్‌ పార్టీ పాత పాటలతో ఓటర్లను ఆకర్షిస్తోంది. ఈమేరకు ఆ పార్టీ అధినేతలు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పర్యవేక్షణలో సాగుతోంది. పాటలు రీమిక్స్‌ చేయడానికి కొందరిని నియమించినట్టు తెలుస్తోంది. కాగా వారందరు పార్టీ అధినేత నివాసంలో ఉంటూ పాటలు తయారు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వారందరు పాటలు రాస్తూనే ఉంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జేడీఎస్‌ మొత్తం 300 కన్నడ పాటలను ఉపయోగిస్తోంది. 1960 నుంచి కన్నడ నాట ప్రాచుర్యం పొందిన గీతాలను మహిళా జాగృతి, యువకుల సమూహంలో ఎన్నికల సందర్భంగా జేడీఎస్‌ తిరిగి వెలుగులోకి తెచ్చింది.

ఇప్పటివరకు మొత్తం 200 పాటలను విడుదల చేశారు. ఇది ఓటర్లను నేరుగా చేరుకోవడానికి ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుందని కుమారస్వామి మీడియా కార్యదర్శి కె.సదానంద తెలిపారు. ఈ పాటలను మహిళలు కూడా వాట్సాప్‌ గ్రూపుల్లో వినే అవకాశం కల్పించారు. వివిధ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా ప్రాంతాల ప్రధాన అభ్యర్థులకు ఈ పాటలు పంపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement