చిత్తూరు , తిరుపతి తుడా:‘అవున్రా..! ఆయన అర్థమేకాడు. ఎన్నికలప్పుడే బయటకొస్తాడు. నేనున్నానంటాడు. ఏదేదో చెబుతాడు. అంతా నాదేనంటాడు. కానీ ఏమీ చేయడు. అన్నింటికీ తలూపాల్సిందే. లేకుంటే దగ్గరుండే కార్యకర్తలపైనా అరుస్తాడు. గడిచిన 12 ఏళ్లుగా ఇదే తంతు. ఏ పార్టీదగ్గర ఏం ఆశిస్తున్నాడో. గతంలో బాబుకు సన్నిహితంగా ఉండి తిరుపతి మున్సిపల్ చైర్మన్ పోస్టు కొట్టేశాడు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి చక్రం తిప్పాలనుకున్నాడు. కానీ అక్కడా ఇమడలేక బయటకొచ్చాడు. అప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యాడు. ఇప్పుడు మళ్లీ తెరపైకొచ్చాడు. టీడీపీ టికెట్ అన్నకేనని తన అనుచరుల వద్ద చెప్పిస్తాడు. ఏంద్రా..! అర్థమేకాడు..’ ఇదీ తిరుపతిలో మాజీ మున్సిపల్ చైర్మన్ కందాటి శంకర్‌రెడ్డి తీరుపై జరుగుతున్న చర్చ.
Comments
Please login to add a commentAdd a comment