సాక్షి, విశాఖపట్నం: నాడు-నేడు కార్యక్రమంపై కొంతమంది బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పవన్ నాయుడు, చంద్రబాబు పవన్ మాటలు.. తల్లితండ్రులను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, నమ్మొద్దన్నారు. పవన్ కల్యాణ్ తన సొంత అన్నయ్య చిరంజీవిని మరిచిపోయి, అద్దె అన్న చంద్రబాబును తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. జనవరి 9 నుండి అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. 2024 నాటికి ఏపీ అక్షరాస్యతలో ఏపీ నంబర్‌వన్‌కు రావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమన్నారు.
అభ్యంతరకర వ్యాఖ్యలు సహించం..
చంద్రబాబుకు పవన్‌కల్యాణ్ అద్దె మైకులా మారిపోయారని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న దొంగ దీక్షలను ప్రజలు నమ్మరన్నారు. సీఎం జగన్‌పై పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించమని ద్రోణంరాజు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment