న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయం రాహుల్‌గాంధీనే అని కాంగ్రెస్ పేర్కొంది. కాబోయే ప్రధానమంత్రి రాహుల్ అని ప్రజలు నమ్ముతున్నారంది. అధికార బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమైతే 2019 ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో కీలకమార్పులు సంభవిస్తాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు.
ప్రస్తుతం ప్రజల ముందు రెండు మోడల్స్ ఉన్నాయని.. రోజుకు ఆరుసార్లు దుస్తులు మారుస్తూ, దేశం కన్నా దుస్తుల గురించే ఆలోచించే ‘మోదీ మోడల్’ ఒకటి కాగా, స్పష్టత, నిరాడంబరతకు ప్రాధాన్యమిచ్చే ‘రాహుల్ మోడల్’ మరొకటి అని అన్నారు. ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తెలిపారు. త్వరలో ఎన్నికలు జరిగే కర్ణాటకలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. అదేవిధంగా, రాజస్తాన్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ట్రైలర్ లాంటిదని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తదితర రాష్ట్రాల్లో కూడా తమదే పైచేయని తెలిపారు.
మోదీకి ప్రత్యామ్నాయం రాహులే: కాంగ్రెస్
Published Mon, Feb 5 2018 3:30 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment