సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ అప్పులన్నీ తీర్చి సంస్థను అన్ని విధాలుగా ఆదుకుంటామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు కుమార్‌రెడ్డి, రవిరాజు, నరేందర్, మౌలానా, కమాల్‌రెడ్డి, కరీం ఆయన్ను శుక్రవారం గాంధీభవన్‌లో కలసి ఆర్టీసీ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. దీనిపై ఉత్తమ్ మాట్లాడుతూ.. ఆర్టీసీని లాభాపేక్ష కలిగిన సంస్థగా కాకుండా, ప్రజారవాణా సంస్థగా గుర్తించాలన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment