లండన్: క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే అనడానికి ఇదొక ఉదాహరణ. కొద్ది రోజుల క్రితమే ఇంగ్లండ్ జట్టు అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో రికార్డు స్థాయిలో 481 పరుగులు చేస్తే.. తాజాగా ఒక జట్టు విజయానికి అత్యంతగా చేరువగా వచ్చి పరుగు వ్యవధిలో ఏడు వికెట్లను కోల్పోవడంతో పరాజయం పాలైంది.
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్ ఈసీబీ నేషనల్ క్లబ్ చాంపియన్‌షిప్ పేరిట వన్డే టోర్నీ జరిగింది. టోర్నీలో భాగంగా సోమవారం హైవైకాంబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పీటర్‌బారో జట్టు నిర్ణీత ఓవర్లలో 189 పరుగులు చేసింది. అనంతరం హైవైకాంబ్ జట్టు బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఓపెనర్ కల్లిస్ (61) రాణించడంతో ఆ జట్టు విజయం దిశగా ముందుకు సాగింది. ఆ తర్వాత హ్యాక్స్(59 నాటౌట్) కూడా రాణించడంతో 38 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 186/3తో నిలిచింది. ఇంకేముంది మూడు పరుగులు చేస్తే చాలు విజయం హైవై కాంబ్‌దే అనుకున్నారంతా. కానీ, ఎవ్వరూ ఊహించని విధంగా మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత కేవలం పరుగు మాత్రమే చేసిన హైవైకాంబ్ మిగతా ఏడు వికెట్లును కోల్పోయింది. దాంతో 39.5 ఓవర్లలో 187 పరుగులకే పరిమితమైన హైవై కాంబ్ రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా మ్యాచ్‌తో పాటు టోర్నీ విజేతగా నిలిచే అవకాశాన్ని హైవై కాంబ్ చేజార్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment