రవిశాస్త్రితో ఎక్కువగా మాట్లాడను! | Don't talk to Ravi too much on bowling, says Axar Patel | Sakshi
Sakshi News home page

రవిశాస్త్రితో ఎక్కువగా మాట్లాడను!

Published Fri, Nov 3 2017 4:21 PM | Last Updated on Fri, Nov 3 2017 4:29 PM

Don't talk to Ravi too much on bowling, says Axar Patel - Sakshi

రాజ్కోట్:తన బౌలింగ్ టెక్నిక్ గురించి భారత క్రికెట్ ప్రధాన కోచ్ రవిశాస్తితో ఎక్కువగా మాట్లాడనని లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ స్పష్టం చేశాడు. అదే సమయంలో రవిశాస్త్రి కూడా తనకు పెద్దగా సలహాలు కూడా ఇవ్వరంటూ అక్షర్ తెలిపాడు. తన బౌలింగ్ ఎప్పుడూ వైవిధ్యంగానే ఉన్న కారణంగానే రవిశాస్త్రి నుంచి పెద్దగా సలహాలు తీసుకోవడానికి ఆస్కారం లేదన్నాడు.

'నా బౌలింగ్ ఇలా ఉండాలని రవిశాస్త్రి ఎక్కువగా నాకు చెప్పరు. అదే సమయంలో నా బౌలింగ్ ను మార్చుకోమనే సలహా కూడా ఆయన కోరలేదు. నేను జట్టులో స్థానం సంపాదించడానికి ఏ రకంగా కష్టపడ్డానో అదే విధంగా శ్రమించమని శాస్త్రి చెబుతూ ఉంటారు. కాకపోతే ఒత్తిడి సమయంలో బౌలింగ్ ఎలా చేయాలనే దానిపై మాత్రమే మేము ఎక్కువగా మాట్లాడుకుంటాం. అంతేకానీ రవిశాస్త్రి ప్రధాన సూచన అంటూ నా వరకూ అయితే చేయలేదు.  ఆయన నాకిచ్చే సలహా ఏదైనా ఉందంటే స్టంప్స్ గురి తప్పకుండా బౌలింగ్ చేయమనే సలహా మాత్రమే' అని అక్షర్ తెలిపాడు. న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య రాజ్ కోట్ వేదికగా శనివారం రెండో టీ 20 జరుగనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement