ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 3–0తో సొంతం చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ డే నైట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 242 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 481 పరుగులతో వన్డే క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖించింది.
తర్వాత ఆస్ట్రేలియా 37 ఓవర్లలో 239 పరుగుల వద్ద ఆలౌటైంది. హెడ్ (51; 7 ఫోర్లు), స్టొయినిస్ (44; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ 4 వికెట్లు పడగొట్టాడు. హేల్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. నేడు నాలుగో వన్డే చెస్టర్‌లీ స్ట్రీట్‌లో జరుగనుంది.
ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్
Published Thu, Jun 21 2018 1:21 AM | Last Updated on Thu, Jun 21 2018 1:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment