'డే అండ్ నైట్ టెస్టులకు సిద్ధం' | England Will Host Day-Night Test, Says Board Chief | Sakshi
Sakshi News home page

'డే అండ్ నైట్ టెస్టులకు సిద్ధం'

Published Thu, May 19 2016 7:01 PM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

England Will Host Day-Night Test, Says Board Chief

లండన్: తమ దేశంలో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్లు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చైర్మన్ కాలిన్ గ్రేవ్స్ స్పష్టం చేశారు. ఇప్పటికే డే అండ్ నైట్ టెస్టులు ఆడటానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  మరోవైపు శ్రీలంక, బంగ్లాదేశ్ లు డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ లపై ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.

 

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తరపున కాలిన్ గ్రేవ్స్ తొలిసారి స్పందించారు. తాము డే అండ్ నైట్ టెస్టుల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. 'డే అండ్ టెస్టులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అది ఎప్పుడు అనేది ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమయ్యాం. డే అండ్ నైట్ క్రికెట్ ను చూడ్డానికి ఆసక్తిగా ఉన్నాం' అని పేర్కొన్నారు. గతేడాది నవంబర్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆడిలైడ్లో తొలి డే అండ్ నైట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement