బాబోయ్‌! అన్నంతపని చేసిన భజ్జీ | Harbhajan Singh launches Bhajji Blast | Sakshi
Sakshi News home page

బాబోయ్‌! అన్నంతపని చేసిన భజ్జీ

Published Tue, May 8 2018 3:01 PM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM

Harbhajan Singh launches Bhajji Blast - Sakshi

సీఎస్‌కే సారధి ధోనీ, హర్భజన్‌ సింగ్‌(పాత ఫొటోలు)

పుణె: ‘టర్బోనేటర్‌’ హర్భజన్‌ సింగ్‌ అన్నమాట నిలబెట్టుకున్నాడు. టీజర్‌లో ప్రామిస్‌ చేసినట్లుగానే ‘భజ్జీ బ్లాస్ట్‌’ షోలో ఇరగదీశాడు. అన్‌లిమిటెడ్‌ ఫన్‌, మస్త్‌ మస్త్‌ మూమేంట్స్‌తో కూడిన ‘భజ్జీ బ్లాస్ట్‌’ ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లతో మాట్లాడుతూ, ఆటలాడిస్తూ సాగే ఈ టాక్‌షో ఇప్పటికే చర్చనీయాంశమైంది. షో పూర్తిపేరు‘క్విక్‌ హీల్‌ హర్భజన్‌ బ్లాస్ట్‌ విత్‌ సీఎఎస్‌కే’.

ధోనీ ఎక్కడ?: రవీంద్ర జడేజా క్రికెటర్‌ కాకపోయి ఉంటే ఏమయ్యేవాడో.. క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ ఆస్ట్రేలియన్ల డీఎన్‌ఏలోకి ఎలా దూరిందో.. విదేశీ అమ్మాయి నుంచి భజ్జీ ఎదుర్కొన్న తలపాగా చిక్కేమిటో.. షారూఖ్‌ సెనోరీటా డైలాగ్‌ను బ్రేవో ఎలా చెప్పాడో.. తదితర ఆసక్తికర దృశ్యాలన్నీ ట్రైరల్‌లో పొందుపర్చారు. కాగా, ఈ ట్రైలర్‌లో సీఎస్‌కే సారధి ధోనీ కనిపించకపోవడంపై అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎపిసోడ్లుగా అతిత్వరలోనే ప్రసారం కానున్న ఈ షో మరిన్ని వివరాలను భజ్జీ అఫీషియల్‌ అకౌంట్ ద్వారా తెలుసుకోవచ్చు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement