ఎఫ్1లో 16 ఏళ్ల డ్రైవర్ | Is he too young for Formula One? | Sakshi
Sakshi News home page

ఎఫ్1లో 16 ఏళ్ల డ్రైవర్

Published Wed, Aug 20 2014 12:02 AM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM

ఎఫ్1లో 16 ఏళ్ల డ్రైవర్ - Sakshi

ఎఫ్1లో 16 ఏళ్ల డ్రైవర్

 మిలాన్: ప్రమాదకర మలుపులు కలిగిన ట్రాక్‌పై అతి వేగంగా దూసుకెళ్లే ఎఫ్1 కార్లను నడిపేందుకు 16 ఏళ్ల టీనేజి కుర్రాడు సిద్ధమవుతున్నాడు. ఫార్ములావన్ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన డ్రైవర్‌గా మ్యాక్స్ వెర్‌స్టాపెన్ చరిత్ర సృష్టించనున్నాడు. టోరో రోసో తరఫున వచ్చే సీజన్ నుంచి బరిలోకి దిగేందుకు మ్యాక్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. హాలెండ్‌కు చెందిన మ్యాక్స్ తండ్రి జోస్ వెర్‌స్టాపెన్ కూడా గతంలో ఎఫ్1 రేసర్‌గా ఉన్నారు. ‘నేను ఏడేళ్ల వయస్సున్నప్పుడు ఫార్ములావన్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ అవకాశంతో కల నిజమైనట్టుగా భావిస్తున్నాను’ అని మ్యాక్స్ తెలిపాడు. గతేడాది తను ప్రపంచ గో కార్టింగ్ చాంపియన్‌గా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement