అండర్సన్కు మందలింపు | james Anderson reprimanded over umpire clash | Sakshi
Sakshi News home page

అండర్సన్కు మందలింపు

Published Sun, Jun 12 2016 7:45 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

అండర్సన్కు మందలింపు - Sakshi

అండర్సన్కు మందలింపు

లండన్:మూడు టెస్టుల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మందలింపుకు గురయ్యాడు. శనివారం మూడో రోజు ఆటలో అంపైర్ ఎస్ రవితో అమర్యాదగా ప్రవర్తించి మ్యాచ్ రిఫరీ హెచ్చరికకు గురయ్యాడు. శ్రీలంక ఆటగాడు రంగనా హెరాత్పై అండర్సన్ స్లెడ్జింగ్ కు దిగిన క్రమంలో ఫీల్డ్ అంపైర్ ఎస్ రవి అలా చేయవద్దంటూ అతనికి సూచించాడు.

 

దీంతో అంపైర్ పట్ల అసహనాన్నివ్యక్తం చేసిన అండర్సన్  లెవల్-1 నిబంధనను ఉల్లంఘించాడు. ఇలా చేయడం ఐసీసీ కోడ్ లోని ఆర్టికల్ 2.1.1 నియమావళికి విరుద్ధం కావడంతో అండర్సన్ ను మందలింపుతో సరిపెట్టారు.  సాధారణంగా లెవల్ -1 నిబంధనల్లో మందలింపుతో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకూ జరిమానా, హెచ్చరికతో కూడిన జరిమానా విధించే అవకాశం ఉంది.  కాగా, అండర్సన్ తన తప్పును అంగీకరించడంతో ఎటువంటి విచారణ లేకుండా మందలింపుతోనే  సరిపెట్టినట్లు మ్యాచ్ రిఫరీ ఆండీ పాయ్ క్రాఫ్ట్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement