త్వరలో పిల్లల్ని కంటాం | 'Junior Malik' is coming soon, Inshallah: Shoaib Malik | Sakshi
Sakshi News home page

త్వరలో పిల్లల్ని కంటాం

Published Thu, Apr 16 2015 12:45 AM | Last Updated on Wed, Jul 25 2018 1:57 PM

త్వరలో పిల్లల్ని కంటాం - Sakshi

త్వరలో పిల్లల్ని కంటాం

  • సానియాకు ముందు
  •  మరో అమ్మాయిని ప్రేమించా
  •  షోయబ్ మాలిక్ వ్యాఖ్యలు
  •  
     ముంబై: సానియామీర్జా, షోయబ్ మాలిక్‌ల వివాహ బంధం గురించి పలు రకాల మాధ్యమాల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరి కెరీర్ విభిన్న క్రీడల్లో ఉండటం వల్ల ఎక్కువ సమయం కలిసి గడపలేకపోతున్నామని, త్వరలోనే పిల్లల్ని కనాలనే ఆలోచనలో ఉన్నామని పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ స్పష్టం చేశాడు. ట్విట్టర్ ద్వారా అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలకు షోయబ్ మాలిక్ చెప్పిన సమాధానాలు.
     
     సానియా నంబర్‌వన్ కావడం చాలా ఆనందంగా ఉంది. తను ఈ ఘనత సాధించగానే డ్యాన్స్ చేశా. వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను.

    సానియా పాక్ తరఫున ఆడాలని నేను కోరుకోవడం లేదు. తాను భారత్ తరఫున ఆడుతూ ఎదిగింది. ఆమె ఘనతలూ వారికే దక్కాలి.

    త్వరలోనే పిల్లల్ని కంటాం. అబ్బాయి పుడితే క్రికెటర్‌ని చేయాలా లేక టెన్నిస్ ఆడించాలా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. అమ్మాయి పుడితే మిరిల్లా లేదా రీమ్ అనే పేరు పెట్టాలి.

      మీరు సానియాను ప్రేమిస్తున్నారా? అనే ప్రశ్న చాలా చిరాకు తెప్పిస్తుంది. క్రికెటర్‌ని కాకపోయి ఉంటే సానియా మేనేజర్‌గా వ్యవహరించేవాడిని.
     
      నాకంటే సానియాకు ఎక్కువ పేరు రావడం పట్ల నాకు అసూయ ఉండదు. నిజానికి తను ఇంకా ఎదగాలని నేను ప్రార్థలను చేస్తాను. సానియా సినిమాల్లో నటించడం ఆమె ఇష్టం.

      సానియాను పెళ్లి చేసుకోవడానికి ముందు టీనేజ్‌లో వేరే అమ్మాయిని ప్రేమించా.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement