విశాఖపట్నం: ఐపీఎల్-9లో భాగంగా శుక్రవారమిక్కడ కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. కింగ్స్ లెవన్ పంజాబ్ బౌలర్లలో మార్కస్ స్టోనిస్ 4 వికెట్లతో చెలరేగాడు. ముంబై టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉన్ముక్త్ చాంద్(0), రాయుడు(0) డకౌట్గా వెనుదిరగటంతో కెప్టెన్ రోహిత్ శర్మ(24 బంతుల్లో 15 పరుగులు) సంయమనంతో బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించినా అతడిని అక్షర్ పటేల్ బోల్తా కొట్టించాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన రాణా(28 బంతుల్లో 25 పరుగులు), పోలార్డ్(20 బంతుల్లో 20) కీలక సమయంలో ఔట్ అవడంతో ముంబై కోలుకోలేకపోయింది. చివరి ఓవర్లో హర్భజన్ సింగ్ ఓ సిక్సర్ బాదటంతో ముంబై జట్టు పంజాబ్ ముందు 125 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఉంచింది.
పంజాబ్ బౌలర్లలో మార్కస్ స్టోనిస్కు నాలుగు వికెట్లు దక్కగా.. మోహిత్ శర్మ, సందీప్ శర్మలకు రెండేసి వికెట్లు దక్కాయి. అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కింది.
రోహిత్ సేనకు స్టోనిస్ దెబ్బ..
Published Fri, May 13 2016 9:57 PM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM
Advertisement
Advertisement