ఓపిక అవసరం: అశ్విన్
బెసెటెరీ (సెయింట్ కిట్స్):వెస్టిండీస్ పిచ్లపై విజయవంతం కావాలంటే ఓపిక అవసరమని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పష్టం చేశాడు. ఇక్కడ స్లో ట్రాక్లపై రాణించాలంటే సాధ్యమైనంతవరకూ ఓపిక మంత్రాన్ని జపించాలన్నాడు. 'విండీస్ తో టెస్టు సిరీస్ లో భారత బౌలర్లు సహనాన్ని కోల్పోకండి. మనం ఎంత ఓపిక పడితే అదే స్థాయిలో ఇక్కడ సక్సెస్ అవుతాం. కొన్ని సందర్భాల్లో ఇక్కడ పిచ్లపై బౌలింగ్ చేయాలంటే బోర్ కొడుతుంది. ఆ క్రమంలో లైన్ అండ్ లెంగ్త్ను కోల్పోయే ప్రమాదం ఉంది. కచ్చితమైన లైన్తో బంతులు సంధిస్తే ఫలితాన్ని రాబట్టవచ్చు'అని అశ్విన్ తెలిపాడు.
గత వార్మప్ మ్యాచ్లో తనకు ఇదే తరహా అనుభవం ఎదరైనట్లు అశ్విన్ అన్నాడు. ఇక్కడ బౌలింగ్ చేయడం ఎంతైతే విసుకు తెప్పిస్తుందో, అంతే స్థాయిలో వికెట్లను కూడా సాధించవచ్చన్నాడు.దానికి ప్రతీ బౌలర్ సంయమనంతో బౌలింగ్ చేయాలని సూచించాడు. తొలి టెస్టు మ్యాచ్ కు ఇంకా వారం రోజుల వ్యవధి ఉన్నందును ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు.