సిడ్నీ : ఆస్ట్రేలియా పర్యటన టీమిండియా యువ వికెట్ కీపర్‌కు అచ్చొచ్చినట్లుంది. ఏం చేసినా అది అతనికి అనుకూలంగా బోలెడంత క్రేజ్‌ను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ టిమ్‌పైన్‌తో స్లెడ్జింగ్ అయితే ఏకంగా హీరోనే చేసింది. ఏ మాత్రం భయపడని ఈ యువ వికెట్ కీపర్ ఆతిథ్య ఆటగాళ్ల మాటకు మాటతోనే బదులివ్వడం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మళ్లీ ఇదంతా ఆటలో భాగమేనని, మైదానం దాటితే తామంతా మంచి స్నేహితులమేనని క్రీడాస్పూర్తి చాటడం అభిమానుల విపరీతంగా ఆకట్టుకుంది.
మైదానంలో సరదాగా.. నా పిల్లలను ఆడిస్తావా? అన్న పైన్ మాటలను నిజం చేస్తూ.. పంత్ వారి పిల్లలను ఎత్తుకుని లాలించాడు. దీంతో టిమ్ పైన్ భార్య.. పంత్ మంచి బేబీ సిట్టర్ అని కూడా కితాబిచ్చింది. ఇక ఈ సిరీస్‌లో ఇదంతా ఒకవైపు అయితే.. తాజాగా జరుగుతున్న చివరి టెస్ట్‌లో అతని అద్భుత ప్రదర్శన మరోవైపు. ఇప్పటి వరకు అడపదడపా ఇన్నింగ్స్‌లతో నోటికే పని చెప్పిన ఈ యువ వికెట్ కీపర్.. చివరి టెస్ట్‌లో విశ్వం రూపం చూపించాడు. 189 బంతుల్లో 159 పరుగులు చేసి తన సత్తా చాటాడు. తద్వారా ఆసీస్ గడ్డపై శతకం బాధిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు.
షాన్ మైఖెల్సా? లేక పంత్?
చివరి టెస్ట్ రెండో రోజు ఆటలో భాగంగా డ్రింక్స్ బ్రేక్ సమయంలో పంత్ చేసిన ఓ సర్కస్ ఫీట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇది డబ్ల్యూడబ్ల్యూ స్టార్ షాన్ మైకెల్స్ రింగ్‌లో చేసిన ఫీట్‌లా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment