బోపన్న ఖాతాలో 12వ టైటిల్ | Rohan Bopanna 12th title | Sakshi
Sakshi News home page

బోపన్న ఖాతాలో 12వ టైటిల్

Published Sun, Mar 1 2015 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

బోపన్న ఖాతాలో 12వ టైటిల్

బోపన్న ఖాతాలో 12వ టైటిల్

నెస్టర్‌తో కలిసి దుబాయ్ ఓపెన్ సొంతం
 న్యూఢిల్లీ: భారత టెన్నిస్ అగ్రశ్రేణి డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్న తన కెరీర్‌లో 12వ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శనివారం ముగిసిన దుబాయ్ ఓపెన్‌లో బోపన్న తన భాగస్వామి డానియల్ నెస్టర్ (కెనడా)తో కలిసి విజేతగా నిలిచాడు.
 
  ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో బోపన్న-నెస్టర్ జంట 6-4, 6-1తో ఐజాముల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్)-నెనాద్ జిమోనిచ్ (సెర్బియా) జోడీపై గెలిచింది. 50 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. విజేత బోపన్న జంటకు 1,49,170 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 91 లక్షల 93 వేలు)తోపాటు 500 ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement