న్యూఢిల్లీ: మోంటెకార్లో ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఐసాముల్ హక్ ఖురేషీ (పాకిస్థాన్) జోడి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది.
మొనాకోలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న-ఖురేషీ ద్వయం 6-7 (4/7), 5-7తో మూడో సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)-ఇవాన్ డొడిగ్ (క్రొయేషియా) జోడి చేతిలో ఓటమి పాలైంది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-పాక్ ద్వయం రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.
తొలి సెట్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌ను ఒక్కోసారి కోల్పోయాయి. నిర్ణాయక టైబ్రేక్‌లో మెలో-డొడిగ్ జంట పైచేయి సాధించింది. రెండో సెట్‌లో బోపన్న ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసినా... తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్స్‌లో ఓడిన బోపన్న జోడికి 21,430 యూరోలు (రూ. 17 లక్షల 86 వేలు) ప్రైజ్‌మనీ, 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
బోపన్న జోడి ఓటమి
Published Sat, Apr 19 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM
Advertisement
Advertisement