సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తాము గతంలో కోరిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజికు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. మొత్తం రూ. 218.67 కోట్ల మంజూరు గురించి ప్రతిపాదనలు పంపామని... కానీ వాటికి స్పందన రాలేదని ఆయన అన్నారు. మంగళవారం దక్షిణాది రాష్ట్రాల క్రీడా మంత్రులతో కిరణ్ రిజిజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్... గత రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి కూడా తమకు నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం తెలంగాణ రాష్ట్రం తరఫున ఆరు క్రీడల పేర్లను ప్రతిపాదిస్తే మూడింటికి అనుమతి వచ్చిందని, మిగతా వాటిపై కూడా దృష్టి సారించాలన్న మంత్రి... కరోనా తీవ్రత తగ్గిన తర్వాతే రాష్ట్రంలో ఆటలకు అనుమతినిస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment