సూర్యకుమార్ యాదవ్ దూకుడు | Suryakumar, Pawar centuries drive Mumbai | Sakshi
Sakshi News home page

సూర్యకుమార్ యాదవ్ దూకుడు

Published Sat, Sep 17 2016 4:02 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

సూర్యకుమార్ యాదవ్ దూకుడు

సూర్యకుమార్ యాదవ్ దూకుడు

ఢిల్లీ: న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో ముంబై జట్టు దీటైన జవాబిస్తోంది. 29/1 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ ను కొనసాగించిన ముంబై జట్టులో ఇద్దరు ఆటగాళ్లు శతకాలతో మెరిశారు. ఓపెనర్ కౌస్టుబ్ పవార్ శతకం రాణించగా, మిడిల్ ఆర్డర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరో  సెంచరీ నమోదు చేశాడు.

 

పవార్(100 రిటైర్డ్ హర్ట్; 228 బంతుల్లో15 ఫోర్లు, 1 సిక్స్) నెమ్మదిగా ఇన్నింగ్స్ ను నిర్మించగా, సూర్యకుమార్ (103;86 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు) తనదైన శైలిలో దూకుడును కొనసాగించాడు.న్యూజిలాండ్ బౌలర్లకు చెమటలు పట్టించిన సూర్య కుమార్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుపడ్డాడు. దీంతో ముంబై 90.0 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 339 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అంతకుముందు న్యూజిలాండ్ 324/7 వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement